Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి రమణీయతను
పెంచేందుకు వికసించే రంగురంగుల పూలు
అందరిని ఆకర్షిస్తు ఆకాశంలో వెలిసే ఇంద్ర ధనుస్సును తలపిస్తాయి
అతివల అందాలను ముస్తాబు చేసేందుకు సౌందర్య సాధనంగ ఉపయోగించే పూలు
పరిమళాలను వెదజల్లుతూ చూపరుల దృష్టిని ఇట్టే కట్టి పడేస్తాయి
దేవతలను కొలిచేందుకు
ప్రతి నిత్యం అవసరమయ్యే పూలు
అందరికి అందుబాటులో ఉంటూ పూజకు పనికొస్తాయి
అభిమానించే వారికి బహుమానముగా సమర్పించే పూలు
రకరకాల దండలుగా మారి
కొట్టు ముందు వేలాడుతూ కొనేందుకు పిలుస్తుంటాయి
పండగ పబ్బాలలో ఇంటి అలంకరణ కోసం అన్నిటికన్నా ముందుండే పూలు
శుభకార్యాలను జరిపిస్తూ సందర్భాన్ని బట్టి తమలోని పవిత్రతను చాటుకుంటాయి
స్వర్గస్తులైన వారి ఆఖరి వీడుకోలు కోసం సిద్దమయ్యే పూలు
కన్నీళ్లను కారుస్తు వాళ్ళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటు లోలోనే దుఃఖిస్తాయి
మనిషి జీవితంలో
ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న
అందమైన పూలు
కేవలం అందరి అవసరాలు తీర్చేందుకే కాకుండా
మన తెలంగాణా ప్రజల సంస్కృతి సంప్రదాయాలను
చాటి చెప్పేందుకు బతుకమ్మగా మారి అందరిచేత
భక్తి భావనలతో ఆరాధింపబడుతున్నాయి!!
- జవేరియా
9849931255