Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాపటేల మా ఇంట
తెల్లగ పూసిన మల్లెలను
రాతిరేల నట్టడవిల
ఎర్రగ విరిసిన మోదుగులను ..!!
నడి ఎండల పంట చేల
ధారగ కారిన చెమటచుక్కలను
పగలురేయి గనులుకార్ఖానాల్లో
వ్యాపించిన స్వేద సుగంధాలను ..!!
ఆకలితీరని పేదరికం
మూల్గులైన మూగవేదనను
అమ్మచేయి విడితెచాలు
అత్యాచారానికి గురౌతున్న ఆర్తనాదాలను..!!
కులంకొరకు చంపుకునే
కుత్సిత బీభత్సాలను
మతంకొరకు జరిగే
మారణ హోమాలను..!!
అధికారం కొరకు సాగె
అన్యాయపు గట్టాలను
అణువణువూ పరికించి
ఆవాహణ గావించి..!!
కవనంలో రంగరించి
కాగడాగ వెలిగించి
లోకానికి చూపించి
నిలదీసి నిగ్గదీసె
ఓ కలమా...నీకు వందనం !!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట