Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటి స్వాతంత్రోద్యమం నుంచి
నేటి సామాజిక సమస్యల సాధనోద్యమం వరకు
పత్రికలు ప్రముఖపాత్రను పోషిస్తూ
ప్రజలకు ప్రభుత్వానికి వారధులై నిలుస్తూ
కల్లోల కరోనా కట్టడిలో జనులను జాగరుకులను చేస్తూ
అవినీతి అక్రమార్కుల గుండెల్లో అక్షరాస్ట్రాలను సంధిస్తూ
గల్లి నుంచి ఢిల్లీ వరకు స్థానిక సమస్యల సాధనలో ప్రభుత్వాన్ని నిలదిస్తూ
నిరక్షరాస్యుల్లో అక్షరజ్ఞానాన్ని అందిస్తూ
వినోదంతో కూడిన విజ్ఞానాన్ని పాఠకులకు చేరవేస్తూ
ప్రజలకు తలలో నాలుకయై
ప్రజాస్వామ్య పరిరక్షణలో
మూల స్తంభమై
రాజకీయ (వి) నాయకుల గుండెల్లో గునపాలై
సక్రమ పాలకులకు చేయూత నిస్తూ
శాంతిభద్రతల పరిరక్షణలో రక్షకభటులకు సహకరమందిస్తూ
ఉషోదయానికి ముందే
ఇంటిముంగిట వార్తోదయాన్ని గావిస్తూ
సకలజనుల సౌఖ్యంకై నిరంతరం శ్రమిస్తూ
జనజీవన స్రవంతిలో భాగమై నిలుస్తూ
జనజీవన చైతన్య ప్రతికలై నిలుస్తున్నాయి పత్రికలు!
దేశ ప్రగతికి పత్రికలే వాకిళ్ళు!
- ఆళ్ల నాగేశ్వరరావు
apsrtc కండక్టర్
గుంటూరు
సెల్ : 7416638823
[email protected]