Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్య కృషి వలు అనునిత్యం కష్టి స్తూ
దేశ ఆర్ధికాభి వృద్ధికి చేయూత నందిస్తున్న
కార్మిక, కర్షక, శ్రమ జీవుల జీవనోపాధిని దెబ్బతిసేలా
దళారీ వ్యవస్థను ప్రోత్సాహిస్తూ
పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ
ఆరుగా లం శ్రమించే శ్రమజీవుల నోటిలో మట్టి కొట్టేలా
చట్టాలను చేస్తున్న ప్రభుత్వాలపై
బాధిత పీడిత జనాలు
సమైక్యమై
ఐక్య పోరాటాలు చేస్తూ
దేశరాజధానిలో నిరసనలు తెలియజేస్తూ
తమ ఆగ్రహ జ్వాలాలను అగ్ని శ్వాసలుగా చేసి
ని రసన ల జ్వాలాలను రగిలిస్తూ
కొండేక్కి కూర్చున్న. నేతలను
కిందికి దిగోచ్చేలా చేసి
చర్చల రసవత్త ర ఘట్టాలను
నిర్వహిస్తూ
నూతన చట్టాల రద్దుకై
పట్టువదలని విక్రమార్కుల్లా
చర్చల పర్వాన్ని కొనసాగిస్తున్నారు
అఖిల. భారత రైతు ఉద్యమ నేతలు
వారి ఆందోళనలకు సంఘ్ భావం తెల్పుతూ
దేశ వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు హాలీకులు!
ఆ. శ్రమజీవుల పోరాటాలు ఫలించి
సువిశాల భారతంలో శ్రామిక జీవనంలో నవ్య రాగాలా పన
జరిగి శ్రమ జీవుల సంక్షేమ ప్రజాప్రభుత్వం ఆవిర్భవించి
కష్ట జీవుల కడ గండ్లు క నుమరుగు కావాలని
ఎ నిమిదిన జరిగే భారత్ బంద్ విజయవంతం కావాలని
కష్ట జీవులకు ఇరువైపులా ఉండే మనమందరం ఆశిద్దాం!
ఆళ్ల నాగేశ్వరరావు
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
7416638823
ఇమెయిల్ : [email protected]