Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ ఒకలా ఉండదుగా కాలం...
నిరంతరాయ నిరంతర గమనమే
దాని నైజం...!
స్వయంకృతాపరాధమో...
ప్రకృతి పరిణామమో...
అతి చిన్న సూక్ష్మజీవి చేసింది...
అందమైన జీవితాలనెన్నో అతలాకుతలం...!
నిండు ప్రాణాలనెన్నో
తీసుకుంది బలి...!
మార్చలేని గతం ఆలోచన మాని...
నూతన సంవత్సరానికి
ఆశల పునాది వేసి...
ఉందిలే మంచికాలమంటూ
ముందుకు నడవాల్సిందే...
బతుకు బండిని నడపాల్సిందే...
జీవన పయనం సాగించాల్సిందే...
సరైన జాగ్రత్తలతో...!
ఉనికికై నిరంతర పోరాటం...
అదేగా మరి జీవుల మనుగడ సూత్రం...!!!
- చంద్రకళ. దీకొండ,
9381361384