Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతను కవి కాదు
కాగితం పైన 'క' న్నీటి 'వి'ప్లవం
అతను పైసల కోసం పేరు కోసం రాయలేదు
పేదల మీద ప్రేమతో మాత్రమే రాసాడు
అతనీ వృత్తి ఫోటోగ్రఫీ
అందుకే అతని రచనలకు అంతటి సూక్ష్మ ద్రుష్టి
అతని జీవితం నిండా పేదరికం తో
జగిత్యాల జైత్రయాత్రే
అతని గుండె ల నిండా మరో ప్రపంచ విహార యాత్రే
అతనికి తెలిసిన సిటీ లైఫ్ చాలా చిన్నది
దాంట్లో ఉండేవి ఎత్తైన ఆకాశ హర్మ్యాలు కాదు
వాటి పక్కనే చిన్నబోయి ఉన్న ప్రజా జీవితాలు మాత్రమే
అతని గుండె కు నయం కానీ జబ్బు చేసింది
అవును సమాజమే ప్రాణం అయ్యిన
వాడికి మిగిలేవి జబ్బులే
అతని ప్రతీ రచన కు ఒక లెక్క ఉంది
అతను లెక్క చేయనిది
కేవలం తన ప్రాణాన్ని మాత్రమే
మరణం అతని చివరి చరణం కాదు
పేదరికం ఉన్నన్నాళ్ళు
ఉద్యమ గేయాల పల్లవి అవుతాడు
సమసమాజం ఏర్పడ్డనాడు
సామాన్యుడి కంటిలో ఆనంద భాష్పాలవుతాడు
- వంశీ కృష్ణ
95429 32438