Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు
7382894581
జగతికి ఉదయంలా
మనిషికి హృదయంలా
వృక్షానికి వేరుల్లా
పుడమికి వృక్షంలా
వాహనానికి ఇంధనం అలా!
ఇంధనంలోనే ఉన్నది ధనం
ఆ ధనాన్ని పొదుపు చేయడమే
మన ముందున్న ముందస్తు కర్తవ్యం
అతివేగం అనార్ధ దాయకం
అవుతుంది ఇంధన వినియోగం అత్యధికం!
వేగం కన్నా ప్రాణం మిన్న
మనపై ఆధారపడిన కుటుంబీకుల ప్రాణాలు అత్యంత మిన్న!
అవసరం మీర వాహనాన్ని వినియోగిద్దాం
వాహన వేగాన్ని నియంత్రిస్తూ
అధిక ఇంధన వినియోగాన్ని అరికడదాం!
ధనం పొదుపు నీ వ్యక్తిగతమ్
ఇంధనం పొదుపు భావితరాలకు అత్యవసరం!
ఇంధన మంటే డిజిలు, పెట్రోల్లే కాదు
నిత్యజీవితంలో మనం వినియోగించే
గ్యాస్, విద్యుత్ వాడకాలు వస్తాయి
ఇంట్లో లానే ఆఫీసుల్లో కూడా
అవసరం మేరకే విద్యుత్‌ను, ఫంకాలను వినియోగిస్తూ
అవసరం లేనప్పుడు బంద్ చేసి
ఇంధన దుర్వినియోగంను అరికడదాం!
నీవు పొదుపు చేసిన ధనం నీకె సొంతం
నీవు పొదుపు చేసిన ఇంధనం
భావితరాలకుతీర్చుతుంది ఇంధనపు కొరతను!
ధనం పొడుపుకు మార్గాలున్నట్లే
ఇంధనం పొదుపుకు పద్దతులున్నాయి
ఆ పద్ధతులను అలవర్చుకుని
ఇంధనం పొదుపును పాటిద్దాం
ఉజ్వల భవితను ఆహ్వానిద్దాం!