Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.కందేపి రాణి ప్రసాద్
98661 60378
"సార్ సార్! ఒక పేషేంట్ పామును తీసుకొని వస్తున్నాడు.హాస్పిటల్ లోపలికి, "కొత్త కంపౌండర్ హడావిడిగా లోపలికి పరిగెత్తి వచ్చి డాక్టర్ కు చెప్పాడు. డాక్టర్ తలా తిప్పి చూసే సరికే కొంత మంది ఒక పిల్ల వాడిని చేతుల మీద వేసుకొని తెచ్చారు.గబా గబా టేబుల్ మీద పడుకోబెట్టారు.వారిలో ఒకతని చేతిలో పాము ఉన్నది.అది చచ్చిన పాము.
అంతలో పిల్లవాడి తల్లి ఏడుస్తూ సారూ పిలగాడు రాత్రి నిదరపోతుంటే పాము కరిసింది. చూడండి అన్నది."పాముని అప్పుడే పట్టుకొని చంపేసినం సారూ! మీకు చూపించాలని ఇదిగో ఇలా తెచ్చాము సారూ అన్నాడు.పామును తెచ్చిన మనిషి. అతడు పిల్లవాడి తండ్రి డాక్టర్ ఆ పామును పరీక్షించాడు.అది నాగుపాము " ఎలా వచ్చి కరిచింది పాము" అడిగాడు డాక్టర్ .రాత్రి ఇంటిబయట చాపమీద పడుకున్నాము.ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు సారూ కాలి మీద గాయం చూసి తెచ్చాము"అన్నారు వాళ్ళు డాక్టర్ పిల్లవాడి కాలిని పరీక్షించాడు.కాలి పాదం మీద రెండు చుక్కల్లా గుర్తులు కనిపించాయి.పిల్లవాడికి నోటివెంట నురగలు వస్తున్నాయి.పాదం పై భాగంలో గట్టిగా ఒక బట్టతో కట్టి ఉన్నది.పిల్లవాడి తల్లి దండ్రులు చాలా తెలివికలవాళ్ళు పాము కాటు లాంటి విషయాల్లో పల్లెటూరి వాళ్లకు చాలా అవగాహన ఉంటుంది.వాళ్ళు తెలివిగా ప్రవర్తించటం వలన బాలుడికి ప్రమాదం తప్పింది.
డాక్టర్ వెంటనే పిల్లవాడికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ గురించి నర్సులకు చెప్పాడు.పిల్లవాడిని పరీక్షించాడు. సెలైన్ పెట్టారు.మందులు తెచ్చుకోమని వాళ్లకు ప్రిస్కిప్సన్ రాసి ఇచ్చాడు.పిల్లవాడి తండ్రి వంక చూసి "ఇక ఆ పామును బయట పడేయండి అందరూ భయపడుతున్నారు." అన్నాడు డాక్టర్ .ఇంజెక్షన్ల్ గురించి చెప్పిన ఇంకా ఎవరూ పిల్లవాడి దగ్గరకు రాకపోవటం చూసి పిల్లవాడి తరపువాళ్ళతో డాక్టర్ ఇలా అన్నాడు.
"పిల్లవాడికి పాము కరిచిన వెంటనే పామును చంపటమే కాకుండా దానిని కూడా తీసుకురావడం చాలా మంచి పని నాగు పాముల విషం మనుష్యుల యొక్క నాడివ్యవస్తల మీద పని చేస్తుంది.అదే కట్ల పాము విషమైతే మానవ దేహంలోని రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది.కరిచిన పాము ఏమై ఉంటుందా అని డాక్టర్ ఆలోచించే కన్నా ఇలా పామును తేవటం వల్ల డాక్టర్ పని తెలికావుతుంది.ఫలితంగా పిల్లవాడికి త్వరగా మందులు అంది ట్రీట్ మెంట్ మొదలవుతుంది.తర్వాత మిరింకో మంచి పని చేశారు. గాయం జరిగిన కాలు పై భాగంలో రక్తం ప్రసారించకుండా గట్టిగా కట్టు కట్టారు.దీనివల్ల విషం ఎక్కువ పాకాలేదు పిల్లవాడు ప్రమాదం తప్పించుకున్నాడు.శభాష్ మీలా తల్లి దండ్రులు ప్రమాద స్థాయిని తగ్గిస్తే చాలా మంచిది."డాక్టర్ వాళ్ళను ప్రశంసించాడు.
"ప్రాణ ప్రమాదమేమి లేదు గదా డాక్టరు గారు !అడిగారు! అందరు ముక్త కంఠంతో ప్రాణ ప్రమాదమేమి లేదుగాని నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండి మందులు వాడాలి.మేము చెప్పినట్లుగా ట్రీట్ మెంట్ చేయించుకోండి .అంతకంటే ఏమీలేదు అన్నాడు డాక్టరు వాళ్లకు భరోసా ఇస్తూ.