Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివక్షపై
విశ్రమించని పోరాటం
విద్యకై
ఆత్మశోధన ఆరాటం
మహాత్ముడైన
జోతిరావుపూలే మార్గం
వివాహవేడుకల్లో
తోటిమనుషుల అమానుషం
తొలిచెనుమదిలో అవమానమై
ఆ అవమానం గుట్టేరిగి
గులాంగిరీ గ్రంథమేరాసి
మానసికదాస్యం వీడాలన్నారు
మహిళలు విద్య పొందాలన్నారు
బాల్యవివాహాలు
సతీసహగమనం
తమాషమేళాలు
అత్యంతహేయమైనవి
ఆత్మహత్యకుహేతువైనవి
అందుకే.......!
అంతు చూడాలన్నారు
అంతం కావాలన్నారు
వితంతువివాహాలేచేయాలన్నారు
ఆచారాల ఆధారం
మూర్ఖపు మనువాదం
ఆచారాలనైనా
మనువాదాన్నైనా
ఎడ్డిగా విమర్శించొద్దన్నారు
ప్రామాణికతనేప్రశ్నించమన్నారు
నిజాన్ని శోధించే
సత్యశోధకసమాజం
సమాజానికి బోధించే
సన్మార్గపుసమభావ0
సన్మార్గపు సమభావంతో
విద్య వికసించాలి
వివక్షా వాడిపోవాలి
✍️ జినుకల వెంకటేష్
కరీంనగర్
9652092120