Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైరి వైరస్ తో జతకూడి
విలయతాండవమాడే "శార్వరి"
కరుణ కరోనాపై చూపక
కఠిన నియమాల బెట్టే "ప్లవ"
ఈ కుదుపు అదుపుల నడుమ
మదుపు చేసిన్నాడే మనుగడ
ఈ నిశి, శశి కాంతుల్లో మనిషి
మనఃస్థితి నిలిపిన్నాడే ఎదగడా..
ప్రకృతి అంటే
పనికొచ్చేదే కాదు,
ప్రాణం నిలిపేది కూడ అని..
ప్రకృతి అంటే
పరిధిలో పెంచేదే కాదు
పరిమితులు విధించేది కూడ అని..
కాలం చెప్పిన ఈ పాఠాలు
కాబోయే వారసులకు గుణపాఠాలు
కళ్ళు నెత్తికెక్కి చేసే నిర్లక్ష్యాలు
కాలయముని చిట్టాలో ససాక్ష్యాలు
కాకూడదు రాకూడదు
మళ్లీ ఇవి పునరావృతమవకూడదు
చేయకూడదు చూడకూడదు
ప్రకృతిపై పైత్య ప్రతాపాలుండకూడదు
ప్రవణ్యమే కావాలి ప్రకృతి
సత్ప్రవర్తనే నేర్పాలి సంస్కృతి
- బొడ్డు మహేందర్, చెన్నూరు, మంచిర్యాల జిల్లా
ఫోన్ 9963427242