Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వసంతబుుతువు వచ్చింది
వనాలు పరవశించాయి
పచ్చదనంతో మెరిశాయి
ప్రకృతికి అందం తెచ్చాయి
ఈ శుభ వేళ
ఈ సుందర వేళ..
వేపపూత పరిమళంతో
మావికాత సోయగంతో
కోకిలకూత పచమంతో
ఉగాదికి స్వాగతం
ఈ శభ వేళ
ఈ సుందర వేళ..
తెలుగు తల్లి మదిలోన ముత్యాలవాన కురిసేను
ప్రకృతి కాంత హృదిలోన ఆనందాల వీణ వ్రెూ గేను..
తెలుగు తల్లి ఒడిలోన
కవికోకిలల కవితా గానాలు
ప్రకృతి కాంత ఒడిలోన
కలకోకిలల కుహూకుహూ గీతాలు
ఈ శుభ వేళ
ఈ సుందర వేళ..
ఎటు చూసినా మావి తోరణాలు
తెలుగు వెూవిపై తేనియ గీతాలు
వెల్లి విరిసే రోజు
వెల్లువలా పారేరోజు
అదే అదే ఈరోజు
ఉగాది పండుగ రోజు
-బూర దేవానందం
9494996143.