Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరికైతే ఏమోగని
నాకైతే జర బుగులుగనే ఉంది
కష్టమో! సుఖమో !
మూడొందల అరవై ఐదు రోజులు
గిట్ల జేస్తివేందని తిట్టుకుంట
కోపం నషాళానికి అంటితే అప్పుడప్పుడు
శాపనార్థాలు పెట్టుకుంటా
ఏం జేస్తం అంతా ఖర్మని
సమాధానపడుకుంటా
గింత కాలం నీతో కలిసి నడిశిన!
ఏమో నిన్ను జూత్తే గూడ
మనసు శానా తరుక్కు పోతంది..
ఇంగెప్పుడూ ఈ ఆంకల రాలేవుగా
అరవై యేండ్లకు నువ్వు మళ్ళొచ్చే తలికి
ఎవలికి ఎవలో గద..
గిప్పటి దాకా
మమ్మల్ని చీకట్ల ముంచినవనీ తెగ ఆడిపోసుకున్నం గని
ఇంగ నువ్వు కూడా..
గా చీకటి కాలగర్భంలో కలుత్తవంటే
జరంతేంది మస్తు బాధగుంది!
ఏదేమైనా శారువరీ!
నిన్ను మెచ్చుకోవాలి గూడా..
మారె ...లేక పోతే..
గీ కరోనా బూచితోనే
పెపంచకమంతా ఏకమయ్యింది..
పేదోడు గొప్పోడు తేడాలేకుండా
సావుబతుకుల్లో సామ్యాన్ని జూపినవు,!
అదర్గనంగా ఎంత సంపాదించినా ఆఖరికి అక్కడే చివరి నివాసమని ఋజువు చేసినవు!
ఏమైనా శారువరీ!
నీకు ఈడుకోలు పలుకుతున్న గాని
వచ్చే నీ చెల్లె ప్లవను
జర మా బతుకులకు మంచి జేయమని చెప్పు...
మాలో కాసింత ధైర్నం నింపి బతుకు పోరులో జయం పొందేట్లు సూడమని చెప్పు...
- వురిమళ్ల సునంద, ఖమ్మం
9441815722