Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లవనామ సంవత్సరం
రేపటి ఆశల తోరణాలతో
ప్రకృతి ముంగిట నిలిచింది
హరివిల్లును పూసే ముగ్గులు
రంగు రంగుల సోయగాలు
గున్నమావి చిగురై స్వాగతించగా
ఏతెంచింది యుగాది
పరుగుతో వచ్చింది ప్లవ వత్సరాది
నూతన వస్త్రాలంకరణలు
పిండి వంటల ఘుమఘుమలు
పిల్లల కేరింతల సవ్వడులు
సాంప్రదాయ వన్నెలతో
తరలి వచ్చింది ఉగాది
షడ్రుచుల సమ్మేళనంతో
వంసంతాల కేరింతలతో
పువ్వుల పరిమళాలతో
తీపి వగరు చేదల్లే
కష్ట సుఖాలు సమపాళ్ళుగా
కదిలి వచ్చింది ఉగాది
మాగాని పంటల ధాన్య సిరులతో
వసంత కోకిల గానంతో
కవి సమ్మేళన ఉగాది పల్లవిగా
పాడుతూ వచ్చింది ఉగాది
ఆడుతూ వచ్చింది ప్లవ ఉగాది
- నెల్లుట్ల సునీత
7989460657