Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లవ నామ సంవత్సర
తెలుగు ఉగాది
ప్రకృతి వసంత శోభ
ప్రగతి ఉగాది
అజ్ఞాన చీకట్లు చీల్చే
విజ్ఞాన ఉగాది
చేదు, తీపి, పులుపు, వగరు
కలబోసిన ఉగాది పచ్చడి రుచులు మానవ జీవితంలో వచ్చి పోయే సుఖ దుఖాల
సంగమం ఈ ఉగాది
తెలుగు చరిత్ర లో తిరగ రాసిన యుగ యుగాల కు
తర తరాల జ్ఞాపకం
ఈ తెలుగు ఉగాది
ఏటేటా ఒక్కో పేరుతో
సరికొత్త దనం
సంతరించుకుని వస్తోంది
ఈ తెలుగు ఉగాది
వసంత భావాల
నవ్య ఉగాది
పంచాంగ శ్రవణం
కవుల కల్పన లో
మధురానుభూతుల
తెలుగు కవితా సమ్మేళనం
వెలుగు భాష కు పట్టాభిషేకం
తెలుగు ఉగాది సంబరం
తెలుగింటి శుభోదయం
ఉగాది ఉషోదయం
జగతికి మహోదయం
మన ప్రాచీన సంస్కృతి కి
ఒక మణిదీపం ఈ ఉగాది
తెలుగు కళా వైభవం
అందరికీ ఆదర్శం ఉగాది
తెలుగు ఉగాది సందేశం
- ఎల్. ప్రఫుల్ల చంద్ర
6300546700