Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంత్రిక జీవనంలో
హృదయస్పందనలకు తావెక్కడ?
కాసుల కొలమానంలో
ఆప్యాయతానురాగాలకు చోటెక్కడ?
కల్మషమైన ప్రేమల నడుమ
కనుమరుగైపోతున్నాయి మమతానుబంధాలు..
పండగంటే..
ప్లాస్టిక్ తోరణాలు..పార్టీలు పబ్బులు..
విందులు వినోదాలు..విచిత్ర వేషధారణలు..వికృత నృత్యాలు..అనే భ్రమలో బతుకుతున్నాం..
యంత్రాలు కనిపెట్టి మనిషి
యాంత్రికంగా మారిపోయాడు..
సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిచ్చాడు..
విదేశీ వ్యామోహంలో..
విర్రవీగుతూ..అంతర్జాల వలలో బంధీ అయిపోయాడు..
గత వత్సర చీకటి ఛాయలు పూర్తిగా తొలగించి...
భయం బెరుకు మిణుకులు పరికించి..
వెలుగు దివ్వెలు ప్రసాదించ అరుదెంచిన
'ప్లవ' వత్సరానికి.. స్వాగతాంజలి పలుకుదాం!..
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.