Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శార్వరీ కల్లోల సాగరంబున మునిగి
అదృశ్య కీడతో అనవరత క్రీడలో
ప్రాణాల నరచేత బట్టుకొని యెసలారు
లోకమును కరుణతో శోకమారగ దరికి
కొనిపోవవచ్చితే? ననుగావ వచ్చితే?
కప్పవై క్రిమినితిని, తెప్పవై దాటించ
కష్టాల కడలినిల గడదేర్చు పడవవై
నష్టాల జగతినల నడిపించు సత్తువైబీ
ఆర్థికము గతితప్పె, హార్దికము లయతప్పె
విద్యలే మతితప్పె, మధ్యమే పురివిప్పె
పాలనము పరుగాపె,గాలనము పనిచూపె
బద్ధకము దివిదాకె, ఇద్దరును వెనుజూపె
గాడి తప్పిన జీవ గమనమును సరిచేసి
జగతి గతి-గమ్యమును చరియింప జేయగా
ప్లవనామ వత్సరమా! పరుగు పరుగున రావె!
శార్వరీ చీకట్ల శమియించి,వెలుగీయ.
నీమీదనె యాశ, నీమీదనె శ్వాస
నీమీదనె ధ్యాస,నీవుంటె భరోసా!
- డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
9963991125