Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి కనిపించక రాత్రికిరాత్రే
కాలసర్మమై కాటువేసిన
రక్తసంబంధాలను రద్దుచేసిన
మాయదారి మహమ్మారినికన్న
శార్వరినామ సంవత్సరాదికి
విషాదంతో... వీడ్కోలు...
కరోనాను ఖతంచేసే విరుగుడు
మందైన వ్యాక్సిన్ ను ప్రసాదించిన
ప్లవనామ సంవత్సర ఉగాదికి స్వాగతం
సుస్వాగతం...ఘనస్వాగతం...
ఉగాది పర్వదినమంటే...
తెలుగులోగిళ్ళకు తొలిపర్వదినమే...
నక్రత్ర కాలగమనమే
"వసంతఋతువు" ఆగమనమే...
"బ్రహ్మదేవుడిచే"
సకలచరార సృష్టి జరిగినదినమే...
"శాలివాహన చక్రవర్తి"
పట్టాభిషక్తుడైన శుభదినమే...
ఉగాది పర్వదినమంటే...
మన "తెలుగు నెల"
చైత్ర మాసం ప్రారంభమే...
మన "తెలుగు నేల" పులకించేవేళ...
"తెలుగుజాతి"
నిండుపున్నమిలా వెలిగేదినమే...
అంతర్జాలంలో పంచాంగం శ్రవణమే...
కవిసమ్మేళనాల్లో
మన "తెలుగుభాషకు"
కమ్మని కవితలతో కనకాభిషేకమే...
మన "తెలుగు తల్లికి"
పసందైన పద్యాలతో పట్టాభిషేకమే...
ఉగాది పర్వదినమంటే...
ఒక ఉషోదయమే...
ఉగాది పర్వదినమంటే...
శుభకార్యాలకు ఒక శుభముహూర్తమే...
- పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్, హైదరాబాద్...9110784502