Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది ఉగాది ఉగాది
మన తెలుగు పండగ ఉగాది
కమనీయం రమణీయం ఉగాది
మన తెలుగు సంస్కృతి కి ఆనవాళ్లు ఉగాది
వసంత కాలంలో చల్లా చల్లా నీ గాలులు
ప్రకృతిలో పచ్చ పచ్చని సౌందర్యాలు
పక్షుల కిలకిల రావాలు
కోయిల ల కుహుకుహు గానలు
ఇల్లు వాడ ఊరంతా ఉగాది పండగ సందడి
ప్రతి ఇంట్లో షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి
మొదలౌతుంది తెలుగువారి నూతన సంవత్సరం
అయ్యవార్లూ చెబుతారు కొత్త పంచాంగం
కొత్త కొత్త ఆశలతో వస్తుంది ఉగాది
నూతన ఉత్తేజం నింపేను ఉగాది
షడ్రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి అవుతుంది
కష్ట సుఖాలు అనుభవిస్తెనే జీవితం నిలుస్తుంది
తెలుగు సంవత్సరాది ఉగాది వేళ
ప్రతి ఇంట్లో ఆనందాల హేళా
ఉదయం పంచాంగ శ్రవణం
సాయంత్రం కోలాటాల కోలాహలం
ఉగాది పండగ అంటేనే తెలుగు వారి సంప్రదాయం
ఉగాది పండగ సందడి లో ప్రతి ఇల్లు ఆనంద నిలయం
ఇదే ఇదే మన ఉగాది ఉగాది
రమణీయ ప్రకృతిలో ఉగాది
- మోతీలాల్ ఆరె కటిక
గాంధారి గ్రామం & మండలం
కామారెడ్డి జిల్లా
9441632348