Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుష్యుల ప్రాణాల్ని పణంగా పెట్టి
భయంకర ప్రళయానికి మానవ జాతిని మట్టుపెట్టే
మారణహోమానికి ఆజ్యం పోయాలని
తెలుగు సంవత్సరాది ఉగాది నాడు
సూర్యోదయం సమయాన
సభలు సమావేశాలు ప్రార్థనాలయాలు
సినిమా హాలులు పెళ్లి మండపాలు వేదికగా
ఈ సంవత్సరం అంతా మనకు నిద్రలేకుండా చేసి
ప్రాణభయంతో ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకునేలా చేసి
తన నామాన్ని 'శార్వరి' కి బదులు 'కరోనా' నామ సంవత్సరముగా మార్చుకుని
మనల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఈ శార్వరి నామ సంవత్సరం
చేసింది చాలదన్నట్లు ఈ సంవత్సర కాలం తన అనుభవాలను మన బలహీనతలను
రానున్న "ప్లవ" నామ సంవత్సరానికి అందించి
"ప్లవ" నామ సంవత్సరాన్ని "విప్లవ" నామ సంవత్సరంగా మార్చి
మానవులపై మరోమారు సెకండ్ వేవ్ పేరుతో విధ్వంసం సృష్టించాలని
పథకాలు రచించ బోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది
ప్రజలారా కళ్ళు తెరవండి
నిర్లక్ష్యాన్ని కాల రాయండి
అప్రమత్తవ్వండి
భౌతిక దూరం పాటించండి
సభలు సమావేశాలకు దూరం అవ్వండి
ముక్కుకు మూతికి మాస్కులు ధరించండి
విందులు వినోదాలు సరదాలు పక్కన పెట్టండి
కుటుంబ సభ్యులతో ఇంటిలోనే గడపండి
శుచి శుభ్రత పాటించి శానిటైజర్ తరచూ వాడండి
వ్యాక్సిన్ వేయించుకుని
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేలా
ఇంటి తిండి తినండి
రండి రండి ప్రజలారా
నడుం బిగించి కదలండి
కరోనాను కట్టడిచేసి
భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైంది
కలసికట్టుగా కరోనా మహమ్మారిని తరిమికొడదాం
"ప్లవ" నామ సంవత్సరాన్ని "ఆహ్లాద" నామ సంవత్సరంగా మారుద్దాం
- ఈతకోట ఏడుకొండలు
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
శ్రీహరికోట విశ్రాంతి ఉద్యోగి
సూళ్లూరుపేట 524121
నెల్లూరు జిల్లా
చరవాణి 9618348548