Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజాన్ని అసమానతలు అంటుకున్న
కాలమున సమసమాజానికి దారి చూపిన దార్శినికుడు
కుల వర్ణ వివక్ష అస్పృశ్యత అవమానాలు చూసి
వాటి అంతానికై అవతరించిన అవతారమూర్తి
అగ్రవర్ణాలవారి అరాచకాలను ఎండగట్టి
దీన దళిత జనుల జాగృత పరిచిన దీనోద్దరుడు
దుర్మదాందుల దుర్మార్గపు చీకట్లను చీల్చి
వెలుగు కాంతులతో వసుధను నింపిన వరపుత్రుడు
అణగారిన జనుల హక్కుల తెల్పి
అభివృద్ధికి ఆయువు పోసి అసువులు నిల్పిన అపరబ్రహ్మ
ఆత్మవిశ్వాసము మించిన ఆయుధము లేదంటు
స్వయంకృషితో ఎదిగిన
నవీన భారతపు న్యాయకోవిదుడా
భారత రాజ్యాంగాన్ని రూపుదిద్ది
భారత ఔన్నత్యాన్ని జగత్ ప్రసిద్దం జేసిన
అంబేద్కర్ మహాశయా
అందుకో అక్షర నీరాజనం
- డి.అమీర్
కొమ్మేమర్రి, కర్నూలు జిల్లా
చరవాణి:9642480702