Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమే మొక్కే
భారతీయభానుడి బతుకులో
కులచీకట్లు కమ్మేసిన కటికదారిద్య్రం
అడుగుఅడుగునా అవమానాలు
పుట్టుకే నిమ్నాతి నిమ్నాం
అయితేనేం.......
ఎదురుగాలే ఉపిరై
క్షణక్షణం ఎదలో రగిలేకసితో
జ్ఞానకొలిమినే రాజేసి
వివక్షక్రౌర్యాలెన్నో కాల్చేసి
నెత్తుటివర్ణం వేడిలో
అక్షరసమ్మేటతోదెబ్బమీదదెబ్బదీస్తే
పొత్తపుపరికరం రూపొందింది
ఆ పొత్తపుపరికరమేరాజ్యాంగం
అంబేద్కర్
చౌదర్ చెరువులో దివ్యొదకాన్ని
దోసిలితోతనివితీరా తాగితే
తక్కిన నీళ్లేమి పాడవలేదు
ప్రకృతేమి ప్రకోపించలేదు
పాడుమనుషులు తప్ప
ఈఘటనే
అస్పృశ్యులలో ఆత్మవిశ్వాసమై
మనుషులలో మానసికసంచలనమై
పోరాటస్ఫూర్తిగాఅలుముకుంది
సంఘటితపోరాటాలకుపురికొల్పింది
అలనాటి
అంబేద్కర్ స్ఫూర్తితో
నేటి రాజ్యాంగ రక్షణతో
జ్ఞానాన్ని బోధించాలి
బాధితులను సమీకరించాలి
రాజ్యాధికారంకై పోరాడాలి.
- జినుకల వెంకటేష్
9652092120
కరీంనగర్