Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోయిల కొత్త సంగీతమేదో నేర్చింది
మామిడి లేలేత పూతతో మెరుస్తుంది
వేపువు ధవళ వర్ణంతో సొగసులద్దుకుంది
మామిడి తోరణం ఆహ్వానం పలికింది
పచ్చని పందిరిలా అల్లుకుపోయింది
ఆప్యాయతల జల్లుని కురిపించింది
ప్రేమతో హత్తుకొని మనసారా నిమిరింది
అలుకు సుక్కల ఇల్లు ముస్తాబైంది
పసుపు కుంకుమల కడప శోభితమైంది
మూలకున్న కూరాడు కొత్త కలి నింపుకుంది
వాసపు ఉట్టి పెరుగు పాలతో అలుగుపొస్తుంది
వసంతం తరువుల చివురులు తొడుక్కుంటే
చైత్రమాసం లేడి పిల్లల గంతులేస్తుంటే
పసుపు కంకణాలు చేతికి రక్షగా నిలుస్తుంటే
షడ్రుచులు జీవిత పరమార్ధాన్ని తెలుపుతుంటే
ఆహ్వానించరా సోదరా కొత్త వసంతాన్ని ప్రేమతో
దుఃఖాన్ని తరిమిగొట్టి ఉత్సాహాన్ని మదిన నింపి
అడుగుని మొదలెట్టి లక్ష్యానికి గురిపెట్టి
అలుపెరగక సాగుతూ మున్ముందుకు తోసుకెళ్లు
✍️ మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి, సూర్యాపేట
99518 79504