Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శార్వరిలో మొదలైన సమస్య...
ప్లవంలోనూ పరుగులెడుతూనే ఉంది...
పరిష్కారానికి దొరకక...!
కోకిల స్వరంలో కరోనా
రాగమే వినిపిస్తోంది...
ఉగాది పచ్చడిని తలచుకుంటే...
చేదు రుచి మాత్రమే గుర్తుకొస్తోంది...!
మామిడి మధురిమ
మనసుకు పట్టకుంది...!
అయినా ఏవీ ఆగడంలేదు...
పెళ్లిళ్లు,సభలు,సమావేశాలు,
ఎన్నికలు...
హత్యలు,ఆత్మహత్యలు,
అత్యాచారాలు...
దొంగతనాలు,మాయామోసాలు,
మద్యపానాలు,మత్తుమందుల రవాణాలు...
భక్తిభావము మరచి బంగారంపై దృష్టి పెట్టే పూజారుల దిగజారుడుతనంతో సహా...
ఏవీ...ఏవీ...ఆగడం లేదు...
ఎవరూ ఆపడంలేదు...!
విద్యార్థుల భవిష్యత్తే...
ప్రశ్నార్థకంగా మారింది...!
కవచం మరచిన సైనికుల్లా...
ముక్కుకు రక్షణ తొడుగుల్లేకుండానే...
నిర్భయంగా తిరిగేస్తున్నారు...!
రోగ నిరోధక టీకా వేసుకున్నా...
కరోనాతో సహజీవనం,
తప్పనిసరి పోరాటం తప్పనివేళ...
స్వీయశుభ్రత,వ్యక్తిగత రక్షణ విధానాలే ఆయుధాలుగా...
అందరమూ పోరాడాల్సిందే...!!!
- చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి,
మేడ్చల్ జిల్లా.
చరవాణి:-9381361384