Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్టు నుండి రాలిన వేప పువ్వు
స్వేచ్ఛగా గాలి గుబాళింపుతో
బంధాన్ని ఏర్పరిచినంతగా
మనిషితో ముచ్చటించాలనుంది
పుడమి కొంగుకు కట్టిన
కలుపుగోలుతనాన్ని కలువడానికి
గుట్టలల్ల , రౌతులపై బాకితే వస్తుందా
మామిడి ఇగురులో ఉన్న
పులుపు కుసుమాన్ని
ఁ ప్రేమ ఁ కొంగుకు కట్టాలనుంది
రైతు జీవితం వగరౌతుంది
వగరు - కంఠాన విషమై
మట్టి కనుపాపలల్లా
మిరపగింజలతో నారు అలుకుతుంది
చేదు చనువైంది
చనువు చులకనైంది
మనిషి విలువలు నవ్వులపాలైపోతున్నై
సప్పగా ఓయలుబోస్తున్న
సర్కారు సరుకుల ధరలు
కారం లాంటి నవ్వుల పువ్వులను
గుంపుగా లేని మనుషులపై పొలమలాడిస్తున్నై
ఆవేదనను తీపిగా మార్చి
నిశ్శబ్ధాన్ని కొసరుగా గుప్పి
అమాయకపు గుడిసెల గుండెలను
ఁ వేళ తాళాలతో ఁ అరుపులను
అధమాలని జూస్తున్నై
నిజం గొంతుకను
గుంజలకు ఉరితీస్తున్నరు
రగులుతున్న రౌద్రాన్ని
రథంపై రంగుల రాట్నమై చూపిస్తున్నరు
వెయ్యిల కొలది గొంతుకల కొలనులో
కురువిప్పి ఆడుతున్న ఆవేదనలను
నిశ్శబ్ధం అంచున
మా ఈ అరుపులను
కిందకి వేలాడదీసీనా సరే..
శబ్ద ప్రకంపనలు
పుట్టలు పుట్టలుగా
మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటై
- తాళ్ళపల్లి శివకుమార్
స్టేషన్ ఘనపూర్
9133232326