Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాగతము నీవు గైకొనుము
వేగముతో రామ్ముగాది వేకువ లో
అభివృద్ధి ఫలములను అందించి
రాగల దినములు సంతోషం పంచు..
వేప పూతతో బెల్లము
ఉప్పు కారం తగినంత
మామిడి ముక్కల పచ్చడి
ఆరు రుచులతో అనుబంధం తెస్తూ..
వానలు బాగా కురిపించి
రైతన్నకు కన్నీళ్లను తుడుచు
బంగారు పంటల అందించి
అధిక ఆదాయం చేతికందించు..
ఆమని చిగురులు
మనసున తామరసంబును
శరీరంపై చిలకరించు
వసంతం చిగురించే మహావృక్షం సుమా..
కోమల కంఠమున కోకిల
చిలుక పలుకుల చిలక
వనమాలి తో జతకట్టి
ఆనందముతో మురిసిపోయాను నీ రాకతో ..
పంచాంగములో రహస్యం
ఆదాయ వ్యయాల జీవితం
అవమాన పూజిత గౌరవం
లెక్కలు వేస్తూ సాగేది మనిషి ప్రయాణం కదా..
కొప్పుల ప్రసాద్,
నంద్యాల
9885066235