Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడికి, గుడికి దూరంగా ఉంటూనే..
ఉన్నత చదువు చదివి దేశ దేశాలన్నీ తిరిగొచ్చి,
రాజ్యాంగాన్ని రచించిన అఖంఢ మేధాజ్యోతి..!
అగ్రవర్ణ నీచ బుద్ధిని ప్రశ్నించిన చూపుడువేలు కత్తిమొన
కు(ల)తంత్ర సమాజంపై ఎక్కుపెట్టిన మహాధనుస్సు
అట్టడుగు వర్గాల పాలిట అఖండజ్యోతి
మానవ రూపంలో అవతరించిన మహాశక్తి
మనిషిలో ఉండవలసింది సమత,మమత..మానవత్వపు ఛాయలే గానీ,
కులమతాలు, వెలివేతలు కావని ఎలుగెత్తి చాటిన లౌకికవాది..!
సమానత్వం కోసం పరితపించిన తొలి న్యాయశాఖ మంత్రి..!
హరిజన, గిరిజనోద్ధరణకై అవతరించిన దళిత మేధావి..!
భారత మట్టిలో పుట్టిన.. బౌద్ధమత సిద్ధాంతాన్ని అనుసరించిన అరుదైన జ్ఞానజ్యోతి..!
వివక్షతను నిరసించి, పెకిలించిన జగజ్జన నాయకుడు..'అంబేద్కరుడు.'.!
- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.