Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిన్లాండ్ :‘ఫిన్లాండ్ తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించామని ఫిన్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు రఘునాధ్ పార్లపల్లి తెలిపారు. ప్రజలు ఆనందంగా నివసించే దేశాల్లో 2021 సంవత్సరానికి గాను ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఫిన్లాండ్ వాసులకు ‘ఫిన్లాండ్ తెలుగు సంఘం’ తరపున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అక్కడ పని చేస్తున్నారు. అలాగే భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చి ఫిన్లాండ్ లో సిర్థపడినవారు దాదాపు పదిహేను వేలు మంది వుంటారు.
ప్రతి ఏటా ‘ఫిన్లాండ్ తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి గురించి ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు పండుగలని నిర్వహిస్తూ మన తెలుగు సంప్రదాయాన్ని నేటి తరానికి తెలియజేస్తున్నారు. అలాగే ఈ తరం పిల్లలకు తెలుగు బాషని నేర్పిస్తున్నారు. అక్కడ ఉగాది పండుగలని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉగాది పండుగ రోజు అక్కడ వున్నా తెలుగు ప్రజల పిల్లలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.