Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 శనివారం ప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలను అంతర్జాలంలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది సంబరాలకు సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి కుటుంబం జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు.
అనంతరం కెనడా, భారత జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో వున్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం, రాశి ఫలితాలను అందరికి వివారించారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కోవిడ్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు. తాకా వ్యవస్థాపక చైర్మన్ చారి సామంతపూడి కెనడాలో తెలుగు వారందిరికి ఎన్నో సేవలు అందిస్తున్న అలెర్టా మంత్రి 'పాండా ప్రసాద్', సన్ డైన్ అధినేత శ్రీధర్ ముండూరు, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్దార్ ఖాన్ లకు ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు.
మన తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల ఎన్నో మంచి పాత, కొత్త సమ్మేళన పాటలతో కార్యక్రమములో పాల్గొన్న వారందిరిని అలరించారు. చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, క్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు,మేధా గేదెల, శ్రీ వత్స సంక ,శ్లోక కేశర్వాణి, అజయ్ అనమంగండ్ల, సంయుత గందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాటలు, నృత్యాలు అందరిని ఎంతో ఉత్తేజపరిచాయి.
ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, మరియు ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్ ను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ గారు కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికి, దాతలకు, అతిధులకు ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమము జయప్రదంగా
ముగిసింది. ఈ కార్యక్రమంలో 500 మంది పైగా కెనడా తెలుగు వారు పాల్గొని విజయవంతం చేసారు.