Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.కందేపి రాణి ప్రసాద్
98661 60378
బతుకమ్మ పండుగ దగ్గర పడుతుంది. అందరి ఇళ్ళలో పిండి వంటల జోరు నడుస్తోంది. ఆ విధి వాళ్లంతా ఒకేచోట కూర్చిని సక్కినాలు పోస్తున్నారు. పండక్కి సక్కినాలే పెద్ద వంటకం ఇవి పోయటమే పెద్ద పని కాబట్టి ఒకరింట్లో వండుతున్నప్పుడు ఇరుగు పొరుగు సాయం వస్తారు. మరొక రోజు వారింట్లో వండుకున్నప్పుడు మిగతవారంత సాయం వెళతారు. ఇలా అందరూ కలిసి మెలిసి పండుగలు చేసుకుంటారు. పిండి వంటలు వండుకుంటారు. ఆరోజు రాదమ్మ ఇంట్లో సక్కినాలు గారెప్పలు, లడ్లు అన్ని చేస్తున్నారు. రాధమ్మకు ఇంట్లో అత్త మామలు లేరు. మూడేళ్ల కిందటే పెళ్ళైంది. ఏడాదిన్నర బాబు ఉన్నాడు. ముందు పండుగలకు తల్లిగారింటికి వెళ్ళింది. ఈసారి ఇక్కడే పండుగ చేసుకోవలనికుంది. దానికోసం సరంజామ అంత సిద్ధం చేసుకున్నది. పండక్కి భర్త నాగరాజు రాధకూ, పిల్లాడికి బట్టలు కొన్నాడు. కొత్త సంసారంలో భార్య భర్తలిద్దరే పండుగ సంబరాల్ని జరుపుకుంటున్నారు. ఇరుగు పొరుగు వచ్చి సక్కినాలు పోస్తున్నారు.
'సక్కినాలు పోయటం అయిపోవస్తుంది రాధ! నువ్వు ముకుట్లో నూనె పోసి కాల్చటం మొదలు పెట్టు' అన్నది ఎదురింటి లక్మి.
'సరేనక్క' అంటూ పొయ్యి వెలిగించి ముకుట్లో నూనె పోసింది. స్టవ్ కిందనే పెట్టుకొని సక్కినాలు కలుస్తున్నది. పిల్లోడు నిద్రపోతున్నాడు. వాడు నిద్రలేచేలోపు ఇవన్నీ చేయాలని రాదమ్మ అనుకున్నది. ఇంట్లో ఉన్న హడావిడికి వాడు మధ్యలోనే నిద్ర లేచాడు. నిద్ర లేస్తూనే అమ్మ అంటూ వంటింట్లోకి వచ్చాడు. ఇక్కడే కూర్చో నాన్న. నాపని అయిపోతున్నది. నీకు అప్పలు పెడతాను అంటూ రాధమ్మ పిల్లాడ్ని పక్కనే కూర్చో బెట్టుకొని నూనెలో సక్కినాలు వెయిస్తున్నది.
పిల్లోడు కూర్చున్నట్లే కూర్చొని అకస్మాత్తుగా ముందుకు వంగి వాళ్ళమ్మ చేయిని లాగాడు ఎత్తుకో మన్నట్లుగా. ఇది ఊహించలేదు రాధమ్మ. నూనెలో గారిటతో అటు ఇటు వెయిస్తున్న రాధమ్మ చెయ్యి లాగేసరికి నూనె మొత్తం కిందకు దొర్లి పోయింది. పిల్లాడి వంటి మీద రాధమ్మ కాళ్ళమీద సల సల కాగే నూనె పడింది. పిల్లాడి కేకలతో ఇల్లు మార్మోగిపోయింది. గబ గబా నూనెను తుడిచి ఆసుపత్రికి పరిగెత్తరు.
డాక్టర్ ప్రసాదరావు పిల్లవాడిని పరీక్షించాడు. పొట్ట భాగమంత కాలిపోయింది. పిల్లోడికి చెడ్డి మాత్రమే ఉండటంతో పొట్ట బాగా కాలింది.పిల్లాడి ఏడుపుకు అంతే లేకుంటా ఉన్నది. ముందుగా ఒంటినిండా అయింట్మెంట్ పూశారు. ఆ మంటలు తగ్గడానికి ఇంజక్షన్లు ఇచ్చారు.
సెలైన్ పెట్టారు.తగ్గడానికి టైమ్ పడుతుంది. పై చర్మం వరకే కాలింది గాని లోపల అవయవాలు బాగానే ఉన్నాయి. కానీ పిల్లోడి భాదే వర్ణనాతీతంగా ఉంది. తగ్గేదాక వాడిని కాపాడుకోవటం పెద్ద సమస్య
వాడి బాధలో ఏమి తినలేకపోవచ్చు కూడా డాక్టర్ రాధమ్మను పిలిచి ఇదంతా ఎలా జరిగిందనే విషయాన్ని కనుకున్నాడు. 'అమ్మా పండుగలు పబ్బలు అనేవి మన సంతోషానికే కానీ ఖచ్చితంగా ఇవన్నీ వండుకోవలని కాదు. పిల్లోడి వయసు తక్కువ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళింటికో అత్తవారింటికి వెళ్ళాలి. కొత్త సంసారల్లో ఇలాంటి సమస్యలొస్తాయనే పండుగలకు పుట్టిళ్లకు వెళ్లడం అనే సంప్రదాయాన్ని పెట్టి ఉంటారు. పిల్లవాడిని పొయ్యి దగ్గరనే ఉంచుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా ఎదురైతాయి. పిల్లవాడిని ఎవరికైనా ఇచ్చి మాత్రమే నువ్వు ఇలాంటి పెద్ద వంటలు వండుకోవాలి. పండగానే ఆదుర్దాలో పిల్లవాడి ఆరోగ్యం బలి చేశారు. మనం బాగుండటం ముఖ్యం పండక్కి అన్ని వండమా అన్నది ముఖ్యం కాదు. ఏ పనైనా ఏ పండుగైన మనకు ఆనందాన్ని మిగిల్చాలే గాని విషాదాన్ని గాదు. ఉమ్మడి కుటుంబాల్లో ఎటువంటి విషాదాలు తక్కువ. మీకు అవగాహనరాహిత్యంతో పిల్లల్ని పెంచడం రాక ఇటువంటి నష్టాలు జరుగుతాయి'. అని చెప్పారు డాక్టర్. 'ఏకానుంచైన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి' సలహా ఇచ్చి పంపాడు డాక్టరు.