Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మస్తిష్కానికి మనసుకు మధ్య అల్లుకున్న అక్షర బంధం..
ముష్కరులు దోచుకోలేని జ్ఞాన బాంఢాగారం,..
విజ్ఞాన సంపదకు నిలయం..
వెలకట్టలేని పుటల పూటం..
ఇంపైన అక్షరాలు పొదువుకున్న
విలువైన వజ్ర కాణాచి..
వ్యక్తి ని శక్తిగా మార్చగల విశ్వ విషయ దర్పణం..
యువతకు ఉషోదయం..
నవతకు నవోదయం,
పెద్దలకు హృదయవికాసం
మానవజాతికి లభించిన అద్భుత వరం..
చరితకు భవితకు వారధి పుస్తకం..హస్తభూషణం..
స్థితిని గతిని మార్చే మహోదయ శక్తి స్వరూపం..
పుస్తకం ఒక జీవితం..వ్యక్తిత్వ వికాసం..
సన్మార్గ పయనం, ఆధ్యాత్మికం,
అద్వైత భావం, విజ్ఞాన కాంతిపుంజం..
అక్షరాల అరమరికలతో
ఆప్యాయంగా నిత్యం పలకరించే ఆత్మీయ నేస్తం..
ఆర్యునిగా ఇల నిలిపే అద్వితీయ సాధనం..!
పుస్తక పఠనం.!!
-సుజాత.పి.వి.ఎల్
సికిందరాబాద్.