Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి అగుపడని
సూక్ష్మజీవి
రెండేళ్ళుగా ప్రంపంచాన్ని
అవిశ్రాంతంగా చుట్టేస్తూ..
అల్లకల్లోలం చేస్తోంది..
మృత్యుదేవత అదృశ్య రూపంతో
మరణ మృదంగం వాయిస్తోంది..
భూవలయాన్ని బొంగరం చేసి
గిరికీలు కొట్టిస్తోంది..
ఎప్పుడు ఎవరి చెవికి
మృత్యు ఘంటికలు వినిపిస్తాయో తెలియక..దినదిన గండంలా
బతు'కీడు'స్తున్న జనాలను చూసి.. విర్రవీగుతోంది..
సమస్త జగతి చూపిన
నిర్లక్ష్య వైఖరిని వేలెత్తి వెక్కిరిస్తూ హెచ్చరిస్తోంది..
మాస్కు ధరించని
వారిని అమాంతం ఆలింగనం చేసుకొని భయాందోళనకు గురిచేస్తోంది..
శుచి శుభ్రతను పక్కన పెట్టి
రుచికి ప్రాధాన్యతనిచ్చే బహిర్గత తినుబండారాలపై
తిష్టేసి కూర్చొని ఆహ్వానం పలుకుతోంది..
వైరస్ విలయాన్ని ఆపాలంటే..
తగు జాగ్రత్తలు తీసుకొందాం
తరిమి తరిమి కొడదాం..
మాస్కు, శానిటైజర్‌తో అంతిమ గీతం పాడుదాం!..
సామాజిక దూరం పాటిస్తూ
కరోనా రహిత సమాజాన్ని పునరుద్ధరించుకుందాం..
బతుకుదాం..బతికిద్దాం!
- సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్