Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరుపులా నాలో కవనవెలుగులు
నింపి కదిలించిన వాడా!
నా యువకాశల ఊహల సుమ
గీతావరణంలోనిండినన్నునడిపే
...అదృశ్య మహనీయుడా !
పతితుల,బాధాసర్పద్రశ్టుల కోసం
అందని ఆకాశ కవితా జగన్నాథ రథచక్రాలనుభూమార్గం పట్టించిన
మహాప్రస్థాన, మరోప్రస్థాన
కావ్య నిర్మాతవు నీవేకదా !
తెలుగు కవిత్వాన్ని శ్వాసించి
తెలుగు పాఠకుల్ని శాసించిన
యుగకవి మహాకవివి నీవే !
ప్రపంచాగ్నికి సమిధవై
విశ్వ వీణకు తంత్రివై
పీడిత జన ఘోషను
విప్లవ విపంచిపై పలికించి
భావకవితా సుందరి పరిష్వంగ
మత్తులో మునిగిన కలాలకు
కొత్త టానిక్, కొంగ్రొత్త రుధిరాన్ని నింపిన సాహితీ ఉద్యమ నేతవు!
సూర్యునితో సూదులతో
శ్రమైకజీవన సౌందర్య పిపాసిగా
ప్రపంచపు బాధను కవితలుగా ఈ
తరాన్నికదిలించినఅక్షరయోధుడా
మండే తన అక్షరాల స్ఫూర్తితో నేటి
కోటి కొత్త గళాలకు జీవంపోసిన
ప్రభంజనం మన శ్రీ శ్రీ యే కదా !
- డా. కె. దివాకరా చారి
9391018972