Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యముని మహిషపు లోహ ఘంటలు
కరోనా విలయమై మ్రోగుతుంటే,
కూలికోసం కూటికోసం పట్నమొచ్చిన
బాటసారులు ఇంటిముఖం పట్టడమే!
పోతేపోనీ, నష్టం వస్తే రానీ,
ప్రాణరక్షణ ముఖ్యమిప్పుడు!
ఇందరు మరణిస్తుంటే,
ఆ పాపం ఎవరిదంది మూగమాస్కు!
ఊపిరులందక నేలకు వ్రాలిపోతూ,
ఒక్క క్షణంలో ప్రాణం విడివడి,
మరేడకో పయనించడమే!
భౌతిక దూరం ఆనందార్ణవం,
ఐసోలేషన్ అనురాగాంబరంలో,
ఒంటరిగా విహరించడమే!
అవిగో! అవిగవిగో!
ప్రసార మాధ్యమ మృత్యు ఘంటికలు!
క్రొన్నెత్తురు వార్తల విపంచికలు!
జగానికంతా సౌఖ్యం నిండగ,
విరామమెరుగక పరిశ్రమించే
వైద్యుడా! ఏయే హృదివీథుల్లో
చంక్రమణం చేశావో?!
కదిలేదీ కదిలించేదీ వ్యాక్సినే!
ఇప్పుడు స్వీయ నియంత్రణం,
కావాలోయ్ మన జనావళికి!
నరజాతి చరిత్ర.. ప్రస్తుతం
కరోనా రణరక్త ప్రవాహ సిక్తం!
సౌందర్యం ఆరాధించే వాడా!
ఓహో మానవుడా! స్వార్థజీవీ!
ఇప్పుడు నువ్వు ప్రకృతి ఖూనీకోరువి!
రాబందుల రెక్కల చప్పుడు మోగకముందే,
నిఖిల లోకం నిస్తేజమవకముందే,
భారత వ్యాక్సిన్ సింహం గర్జిస్తోంది!
ఏడవకండేడవకండిప్పుడు!
వస్తున్నాయొస్తున్నాయ్!
కార్మిక లోకపు కళ్యాణానికి,
భూతల భవితవ్యానికి చైతన్యపు
కిరణాలొస్తున్నాయ్!
నేనొక్కణ్ణే ధాత్రినిండా నిండిపోయి,
లోకమంతా వెలుగులీనే,
ఆరోగ్య భానువులాగమిస్తాయ్!
- అవుసుల భానుప్రకాశ్
9603204507