Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ వాక్యం ఎలా రెక్క తొడిగిందో
ఏ భావం నిన్ను ఏ దిక్కడిగిందో
ఎన్ని సామాజిక సమస్యలు నీ ముందు సాగిల పడ్డవెటులనో
మీ చూపులు ఎన్ని చితికిన బతుకుల చింతల అగాధాల లోతులు కొలిచినవో
మీ చిత్తం ఎన్ని గతులుమారి ఎన్ని కొట్టివేతలచిత్తులై రాతలై కాయిదం పై నిలిచెనో
నిస్వార్థంగా
నిరంతంగా
సాగింది మీ అక్షరం...
నిర్మోహమాటంగా
మహా బాహటంగా
గళమెత్తింది మీ స్వరం...
సమసమాజం కోసం
స్వప్నించిన మీ కళ్ళకు కన్నుమూత
తపించిన మీ కలాని పెన్నుమూత
మీకు ఇట మరణం లేదు మధూ
మీ సమస్తసాహిత్యం వేయిపుటలై
అక్షరాల అలలు అలలై
అదిగదిగో ఉదయిస్తుంది మహారవిగా
నీకెక్కడిది తండ్రీ అస్తమయం... ఓ మహాకవీ
మా గుండెళ్లో నీవెప్పుడూ చిరంజీవే మధు
- నల్లగొండ రమేష్
83094 52179