Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దల మాట ల్లో ఎన్నో సార్లు విన్నాను ఆ నాలుగు....అనడం.
నిర్మానుష్యమైన గది లో వున్నాను... ఒంటరిగా
ఓ మూలన ఉన్న మంచం మీద కూర్చున్నాను.మనసులో ఎదో ఖాళీ అనిపిస్తుంది...
పొద్దుటే లేచి హడావుడి, పరుగులు, ఉరుకులు, ఫోన్ కాల్స్....
ఈరోజు అవేవీ లేవు,నా చుట్టూ శూన్యం, నాలో శూన్యం
ఈ నిర్లిప్తత తో కూడిన శూన్యం చూస్తుంటే అమ్మ గర్భంలో వున్నట్టు అనిపిస్తోంది
రోజు నా చుట్టూ అలుముకునే ఆ నలుగురు ఏరి ఈరోజు?
కేవలం ఈ గదిలో వున్న ఈ నాలుగు గోడలు మాత్రమే నా చుట్టూ వున్నట్టు అనిపిస్తోంది...
మరణం తర్వాత ఇలాగే వుంటుందా అనిపిస్తుంది ఈ శూన్యం చూస్తుంటే...
అన్ని బంధాలు పదిలం అనుకునే ఘడియ నుండి అన్ని బంధాలు వదులుకుని
వెళ్ళే ఆ ఘడియ తదనంతరం నా చుట్టూ అలుముకునే శూన్యం ఇదేనేమో .....
హాస్పిటల్ గేటు ఆవలే అందరూ నా వాళ్ళు
ఈవల నేను ఈ నాలుగు గోడలు
నన్ను అలుముకున్న ఈ శూన్యం...
ఇలా ఎదో ఆలోచిస్తూ వున్నాను...
నా గురుంచి నా గడిచిన జీవితం గురుంచి నాలోకి నేను దూరి ఆలోచిస్తున్నాను...
ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే తీరికే దొరకలేదు
నేడు అవకాశం దొరికింది అనిపించింది...
కాస్త ఊపిరి గట్టిగా తీసుకుంటూ పడుకున్నాను మందులేసుకుని...
నిద్ర ముంచుకొచ్చింది..
మెలకువ రాగానే లేచి చూసా ఒంటరిగా వున్నానని గుర్తు వచ్చింది
ఎవరైనా పలకరిస్తే బావుండును అనిపించింది
కానీ ఈ కరోనా వల్ల నా గది వైపు వచ్చే ధైర్యం
ఎవరు చేయరు కదా అని అంటూ ఒక నిట్టూర్పు....
ఒంటరిగా వుంటే ఇంత భయానకంగా వుంటుందా...
ఇంట్లో మా ఆవిడ పిల్లలు నా గురించే ఆలోచిస్తూ వున్నారు పాపం
ఇంకా ఐదు రోజులు ఈ ఎడబాటు తప్పదు...
వద్దన్నా ఏవో ఆలోచనలు మనసులో మెదులుతూ వున్నాయి
నాకేమైనా అయితే పాపం నా భార్య పిల్లలు ఎలా?
ఏమి తెలియని అమాయకులు ....
ఈలోగా ఐ సీ యూ నుండి గుడ్డ కప్పేసి
ఒక శవాన్ని తీసుకెళ్తున్న వైపు నా దృష్టి పడింది
అపుడు నాలో నేను భయపడ్డాను
ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేమో నేను
అనవసరంగా పనుల్లో పడి నిర్లక్షం చేసా
రేపు నా శవాన్ని అలా తీసుకెళ్తూ అనే ఆలోచన నన్ను కుదిపేసింది
పాపం ఏ కన్న బిడ్డడో...అని నిరుత్సాహంగా నడుం వాల్చాను
మా అమ్మ గుర్తు వచ్చింది
నా కన్నీళ్లు ఆగలేదు
మనసులో ఏ బాధ కలిగినా అమ్మ ఒడిలో తల పెట్టీ వెక్కెక్కి
ఏడ్చినా కూడా ధైర్యమే అనిపించేది
అమ్మ కాలం చేసి ఒక సంవత్సరం గడిచింది...
ఇలా ఎన్నో ఆలోచనలూ నా మనసుని కుదిపేస్తున్నాయి...
నాకేమైనా అయితే ఎలా నా కుటుంబం...
నేను లేని వాళ్ళను ఊహించుకొలేను....
అని శూన్యంలోకి చూస్తూనే రోజులు గడిచాయి
బయటికి వచ్చి చూస్తే తల్లి గర్భం నుంచి అప్పుడే
జన్మించిన బిడ్డ లా కొత్త ఫీలింగ్ కలిగింది
ఇదే నాలో కలిగిన మార్పుకి సంకేతం కాబోలు
డాక్టర్లునాకు మళ్లీ పునర్జని ఇచ్చారు
అందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు
కాబట్టి కుటుంబ సంక్షేమం కంటే మించిన పనే లేదు
కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుందాం..
మనల్ని, మన కుటుంబాన్ని, సమాజాని కపాడుకుందాం..
- శ్రీమతి బండి రాధాకృష్ణారెడ్డి