Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవత్వభావ విత్తనానికి
మొలకెత్తిన మొక్క రెడ్ క్రాస్
యుధ్ధాల్లో..నేలకొరిగిన
క్షతగాత్రులను అమ్మలా
పొత్తిళ్ళ చేర్చుకుని..కట్టుకట్టి మందులిచ్చి
జీవం పోసే సంజీవని రెడ్ క్రాస్
అవును అమ్మ ఎవరికైనా అమ్మేకదా!
జాతి కుల మత భేదాలే కాదు
సరిహద్దుల గీతలు తుడిచే
వసుధైక కుటుంబ..
సమైఖ్యభావ ప్రదర్శిని రెడ్ క్రాస్
కొన్నింటి సేవను కొలవలేం
మాటలతో పొగడలేం
కొండంత చరిత్రకు
పురస్కార నూలుపోగులెయ్యలేం
మరణాన్ని జయించి సజీవులైన వాళ్ళ గుండెలోతుల్లో గుడికట్టుకున్న
కళ్ళలో అఖండ జ్యోతిలా ప్రజ్వరిల్లుతుంది రెడ్ క్రాస్
నమ్మి కొలిచిన దైవ రూపాలతో
ప్రాణదీపానికి అరచేతులడ్డుపెట్టి కాపాడే
దివ్యరూప చైతన్యం
మదర్ థెరెసాలెందరో మూర్తీభవించిన
కారుణ్య సంఘం..రెడ్ క్రాస్!
సేవాభావ సభ్యుల సమూహం!!
- సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్