Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలై కవితసుభాష్
కౌలాస్ గ్రామం, కామారెడ్డి జిల్లా
6281950150
అమ్మా....
అనే పేరులోనే ఉంది కమ్మదనం
ఆత్మీయ ఆనందం, ప్రేమ మాధుర్యం
అయస్కాంతం లా ఆకర్షించే పదం
బొడ్డు తాడును తెంచినా కదిలించే పేగు బంధం
దేవుని ప్రతిరూపానికి నిలువెత్తు నిదర్శనం
తాను తరువు లా బాధను దాచి
నవ్వుల పువ్వులు పూయిస్తుంది
అణువణువునా పరమాణువే అవని లో అమ్మ అవతారం
ప్రేమ ప్రతిరూపాన్ని చూసి,కాన్పు నొప్పుల బాధను మరిచి
మరో జన్మ అని తెలిసి అమ్మ అనే పిలుపుకై
కష్టాల కడలిని మోసి,అమ్మ అనే కమ్మనైన వరాన్ని పొంది మురిసిపోతుంది
అనునిత్యం వెలుగుపంచే ఆరని జ్యోతి
నిష్వార్ధపు త్యాగ నిరతి
పిల్లలే పంచ ప్రాణాలుగా బతుకే మాతృమూర్తి
చీడపీడలను కరిగించే హారతి
బిడ్డలు అంగవైకల్యాలను మరిచి పోయేలా ప్రేమను పెంచి పంచుతుంది
కంటి పాపలా కాపాడుతుంది
అమ్మతోనే ఆనందం, ఐశ్వర్యం
అమ్మను ఆదరించి గౌరవించాలి
ఆనందం పంచాలి,కంటిపిపలా కనిపెట్టుకుని ఉండాలి