Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ అనురాగం పంచే దేవత
అమ్మ బిడ్డకు భవిష్యత్తు
అమ్మ ప్రేమకు చిరునామా
అమ్మ ప్రేమకు ఇలలో సాటేదిలేదు ఉండదు
అమ్మ ఆకలితీర్చి ఆనందం పంచుతూ
బిడ్డలకు కన్నీళ్లు తుడిచే ధైర్యం
అమ్మ చిన్నతనంలోనే మంచిని నేర్పి మనిషిగా తీర్చును
అమ్మ బిడ్డల ఆవేదన అర్థం చేసుకుని ఆలంబనగా నిలబడి ఆశయంవైపు నడిపించేది
అమ్మ అనంతం
ప్రతిచోట తన జ్ఞాపకాలు నడిపిస్తుంటాయ్
అమ్మ చల్లని చూపు అమృతమై కడవరకు తోడుంటుంది
అమ్మ ధ్యాసంతా బిడ్డల క్షేమమే!!
అమ్మ లేనినాడు అంతా శూన్యం
కానీ...!!
అమ్మ మనమీలోకంలో జీవించినంతకాలం ఆమే మనల్ని చూస్తూనే వుంటది
ఎందుకంటే..?
అమ్మ ప్రేమ అనంతం!!
(మాతృదినోత్సవ సంధర్భంగా)
- సి. శేఖర్(సియస్సార్), పాలమూరు,
9010480557.