Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ గురించి రాయటానికి ఏముంటుంది
అనుకుంటూ మొదలు పెడితే
అక్షరాలు,పదాలు సరిపోవని అర్థమైంది...
ప్రపంచ భాషలన్నీ కలిపినా వర్ణించటానికి
సరైన పదం దొరక్క ఆశ్చర్యమైంది...
రోజు మొదలు నిద్రించే దాకా
మన ప్రతి కదలికలో తానే ఉందేంటని
అబ్బురపడి ఋణం తీరని బంధమనిపించింది
సాధారణమనిపించే అసాధారణ వ్యక్తిత్వంతో
సవ్యసాచిగా ఒకేసారి పది పనులు పూర్తి చేసే
ఆ లౌక్యం అమ్మకెలా అబ్బిందో...
ఒకేసారి చుట్టుముట్టిన సమస్యలను
లౌక్యంతో అంత సులువుగా
పరిష్కరించే నేర్పు చూసి
నిజం చెప్పొద్దూ
ఈ చదువు ఎక్కడ దొరుకుతుందని వెతికితే
అది అమ్మకు చెందిన విశ్వవిద్యాలయంలోనే
అని అర్థమై ఒకింత సిగ్గు ఆవహించింది...
అమ్మకు మాత్రమే సాధ్యమైన
ఆ నేర్పు ఓర్పు సహనం పట్టుదలలో
కొంతైనా పట్టుబడితే
జీవితాన్ని ఈదటం చాలా తేలికేమో అనిపించింది
కాని అది అమ్మకే సొంతమైన పాఠ్య ప్రణాళిక
అంతే కదా మరి
అమ్మ అమ్మే కాని మనం కాదు కదా...
కరోనా మహమ్మారి మనల్ని చుట్టుముట్టిన వేళ
మన మనో ధైర్యమైన
అమ్మ అండతో ఆ భూతాన్ని గెలుద్దాం...
మీరు ఏమంటారు మరి....
- అట్లూరి వెంకటరమణ
9550776152