Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా ....!
పుట్టుకనే ఓ సమరంలా
ఎదుగుతున్నోవు సహనవృక్షంలా
అమ్మానాన్నల ప్రేమకళగా
అన్నాదమ్ముల ఇంటికళగా
గారాబమే నీ పెన్నిధిగా
అనురాగమే నీ జీవననిధిగా
చదువులో సరస్వతివై
నీ పిల్లలకు ఆదిగురువు నీవై
నీరంతరశ్రమతో ధృఢదీక్షతో
సకల రంగాలలో గొప్ప నైపుణ్యం సాధించావేల.....?
నీ ప్రతి మాట పలికెను ప్రేమ లీలా
నువ్వు అద్భుతమైన పరిమళ మాలా
అమ్మాయి నుండి ఆలిగా మారవు ఇలా .
కానీ.....,
నీ భర్త దెబ్బలకు మాత్రం నువ్వు శిల .
నీకు నా చేతులారా నమస్కారమే ఓ 'మహిళ ఁ.
- ఆదిమల్ల జాహ్నవి
నల్గొండ
ఐఐఐటీ,బాసర విద్యార్థిని