Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లీ.. నన్ను క్షమించు
నీకు మాతృ దినోత్సవ
శుభాకాంక్షలు చెప్పనందుకు..
నీ కష్టాలు తీరినపుడు
నీ కంట కన్నీరు కారనపుడు
నీవు సమానంగా
గుర్తింపు పొందినప్పుడు
నీవు స్వేచ్చగా తిరిగినప్పుడు
నీవు స్వతంత్రంగా
బ్రతక గలిగినపుడు
చరిత్రకు మూలం నీవేనని
వర్తమానానికి నీవే దిక్సూచని
నిజంగా గుర్తించబడినపుడు
తల్లీ.... అప్పుడు
నీకు నిజమైన మాతృ
దినోత్సవం
అప్పుడు చెప్తా శుభాకాంక్షలు..
--దిలీప్.వి
జిల్లా కార్యదర్శి
మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్:8464030808