Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి:
అమ్మ...అమ్మేగా అనురాగపు మూర్తిరా
జననీ....జగతిలోన పల్లవించే అమ్మరా....
చరణం:1
వందలో ఒకరు....కోట్లలో ఒకరు....
నన్ను నన్నుగా ప్రేమించిన
ఒకే ఒకరు.....అమ్మే కదా....!
మది తలుపులు తెరిచే దేవతా
అమ్మా....అమ్మా....అమ్మా...అమ్మా...!
చరణం:2
జగతిలోన అందం....
ఐశ్వర్యమే సిరిగా చూపనిది
ప్రేమామృత జలంపంచే విలాసినిగా
ఒకే ఒక ధృవతార వెలుగు అమ్మ రూపం
మమతలద్దే సౌజన్యమూర్తి అమ్మేగా....!
చరణం:3
అమ్మాన్న పిలుపులోనే
అమృతాల జల్లులు విరియు
జీవిత భాగస్వామి ఇలకాలోనే
లక్ష్మీరూపు తావి అమ్మ మనుసురా.....!
ఇలలోనే వెలుగులీనే క్రాంత దర్శిరా...!
పడతీయన్న పదమే పరుల సొత్తులయ్యేరా...!
చరణం:4
బంధాల్లో నలుగుతున్న స్త్రీ రూపమే
అక్షరాల్లో బంధించిన స్త్రీ చక్రం
పద్మవ్యూహల కడలి పరద తెరల్లోనే
మగువకాదీది అపరకాళీకా శక్తి మా అమ్మ
ప్రపంచ విపణిలో అమ్మేరా రారాణి
చరణం:5
మన పుట్టుకకు చిరునామా....
మన గమనానికి జీవ నది
మన సృష్టికి మూల ధాతువు
అమ్మేగా బంధాల అల్లికకు ఆదరువు
అమ్మేగా...ఆత్మీయత పంచే నందనవనం
చరణం:6
అమ్మంటే చాకిరీల పనిమనిషి కాదు
కనులు తెరిచిన క్షణాన అవధుల నుండి
సుడిగుండాల లుముకున్న...
బంధానాల బాధ్యత కోసమై
కంటికి రెప్పల కాపు కాచేనా
ప్రకృతికి జీవంధార బోసిన పావనమూర్తి అమ్మా...
అమ్మకు మరియెవ్వరు సాటిరారు
అమ్మా...అమ్మా....అమ్మా...అమ్మా..!