Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనులు తెరిచిన క్షణం
కనపడే రూపం అమ్మ
తన ఆత్మ, శరీరం పంచి..
మనకు జన్మనిచ్చిన దివ్యరూపం అమ్మ
తన రక్తాన్ని పాలుగా మార్చి..
మన ప్రాణం నిలుపుతుంది అమ్మ
మన మౌనం సైతం..
అర్దం చేసుకోగలదు అమ్మ
మన ప్రాణానికి తన ప్రాణం అడ్డువేయడానికి ..
ఏమాత్రం వెనుకడాదు అమ్మ
తనవన్నీ త్యాగం చేస్తూ..
మన ఎదుగుదలను కోరుకుంటుంది అమ్మ
ప్రేమ అనే పదానికి అర్ద అమ్మ
అమ్మ అనురాగ రుణం తీర్చే దారేది..?
మా అమ్మకు తిరిగి అమ్మను అవడం తప్ప..
- సి ఎస్ వి వైష్ణవి దేవి
హూజుర్ నగర్