Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలలు నిండిన గర్భిణికి
పురుడు పోసే జగజ్జనని..
ప్రసవ వేదనకు
మాటల సాంత్వననిచ్చే అమృతమయి..
హస్తలాఘవంతో
బిడ్డ లేలేత శరీరానికి
ఏ మాత్రం బాధ తగలకుండా బయటకు తెచ్చే ఇంద్రజాలిని..
బొడ్డుకోసి మురిసిపోయే
అపర ధన్వంతరిణి..
స్త్రీ కి ప్రసవం పునర్జన్మ అయితే
దాన్ని సుఖాంతం చేసే బ్రహ్మరూప స్వరూపిణి..
ఆపత్కాలంలో అనారోగ్యులకు ధైర్యమనే ఔషధాన్ని నింపే
నిస్వార్థ సేవామూర్తి..
నర్సు!
-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.