Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్మి దొడ్లో కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టింది. కట్టెల మీద కిరసనాయిలు పోసి వెలిగించింది ఇంట్లో అందరూ చన్నిళ్ళ స్నానం చేసినా పిల్లోడికి మాత్రం వేడి నీళ్ళు కాగబెట్టి మరి స్నానం చేయిస్తుంది. ఇంట్లో అత్త మామ ఉంటారు పొలానికి వెళ్లారు. ఇంకాసేపట్లో వస్తారు. వాళ్ళు వచ్చేలోపు పిల్లోడికి స్నానం చేయించి వంట మొదలు పెడితే సరిపోతుంది. లక్ష్మికి మూడేళ్ళ ముద్దుల కొడుకు రాజేష్ ఉన్నాడు. లక్ష్మికి భర్త వెంకటేష్ అత్త మామలకు గారాబాల పుత్రుడు.
పొయ్యిలో కిరసనాయిలు పోసి వెలిగించాక ఆ సీసాను తలుపు మూలాన పెట్టింది. లక్ష్మి వేడినీళ్ళు, చల్ల నీళ్ళు రెడీ పెట్టుకొని రాజేష్ కోసం వచ్చింది. పిల్లోడు తలుపు మూలన కూర్చొని కిరసనాయిలు తాగుతున్నాడు. ఆ సీసాలో అప్పటికే సగం తాగేశాడు. లక్ష్మి అలా చూడగానే గుండెలు బాదుకుంది. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ పొలానికి వెళ్ళారు. పెద్దగా కేకలు పెడుతూ బయటకు వచ్చింది. పక్కింటి వాళ్ళ సాయంతో పిల్లోడిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది.
గబగబా ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లల డాక్టరుకు చూపించారు డాక్టరు పరీక్ష చేశారు ని కిరోసిన్ ఎంత తగదు ని అని అడిగాడు డాక్టరు. ని సీసాలో సగం తాగేశాడు డాక్టరూ ని అంది లక్ష్మి ఏడుస్తూనే. ని సీసా చిన్నద పెద్దదా అమ్మా ని అంటే అరలిటరంత సీసా ఉంటుందా లేదా టానిక్ సీసా లాంటి సీసాన ? అడిగాడు డాక్టరు. పిల్లవాడు ఎంత తగదో నిర్దారించుకోవటానికి కొంత మంది పేషంట్లు వివరాలు చక్కగా చెపుతారు. దాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయడం సులభం అవుతుంది. కొంతమందిని వివరాలు అడిగి తెలుసుకోవాలి. కొంతమందిని అడిగినా వివరాలు సరిగా చెప్పలేరు అటువంటి వారితో చాల కష్టం.
ని టానిక్ సీసా అంత ఉంటుంది సార్ దానిలో సగం తాగేశాడు. అప్పటి వరకూ నా పక్కనే ఉనాడు. ఎప్పుడు తాగేశాడో ఏమో! వాడికి తగిన్తే టానిక్ సీసా అయిపోయాక కిరసనాయిలు పోసుకున్నాను సార్. ఒక వేల టానిక్ అనుకుని తాగేసి ఉంటాడు సార్ ని అన్నది లక్ష్మి కళ్ళు తడుచుకుంటూ.
పిల్లవాడికి సెలైన్ పెట్టారు. మందులు తెచ్చుకోమని రాసిచ్చారు. ఇంజక్షన్ చేశారు. వార్డులో అడ్మిట్ చేయమై సిస్టర్ కు చెప్పి డాక్టరు లక్ష్మిని పిలిచాడు. అంతలోనే విషయం తెలుసుకున్న భర్త వెంకటేష్ అత్త మామలు ఆసుపత్రికి వచ్చారు.
ని పిల్లాడు ఎలా ఉన్నాడు డాక్టర్ ని అందరూ ఒకసారి ముక్తకంఠంతో అడిగారు.ు చూడాలి ఈ రోజంతా ఇక్కడే ఉండండి. పిల్లోడి పరిస్థితిని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. లోపలున్న కిరోసిన్ చేసే పనిని తగ్గించాలి కదా. రేపటికి ఆయాసం రావచ్చు. నేను జాగ్రత్తగా చూస్తాను భయపడకండి ని అన్నాడు డాక్టరు.
సిస్టర్ ను పిలిచి పిల్లవాడికి ఇవ్వాల్సిన ఇంజక్షన్లు చెప్పి పంపిచాడు. తర్వాత మరల పిలది తల్లితండ్రులతో ఇలా చెప్పాడు ఉ టానిక్ సీసా అయిపోయాక కిరోసిన్ పోసుకుని వాడుకున్నారు. పిల్లాడు రోజు తాగించే టానిక్కని భ్రమ పడ్డాడు. చాల మంది పౌడర్ డబ్బా అయిపోయాక అందులో చేమల మందు పోస్తుంటారు. ఈ పని కూడా చాల ప్రమాదకరం. తరవాత మిమ్మల్ని చూస్తే వ్యయసాయ దారుల్లా ఉన్నారు.ఇంట్లో పొలానికి కొట్టే ఎండ్రిన్ లాంటి మందులు ఉంటాయి. వాటిని పిల్లలకు అందకుండా బాగా ఎత్తులో పెట్టుకోవాలి. చాల మంది పిల్లలు ఎండ్రిన్ లాంటి మందులు తాగారని ఆసుపత్రికి వస్తుంటారు. కొత్త మంది బతికిన, మరి కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇంట్లో పసిపిల్లలున్నారంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు అర్థమయేలా అన్ని విషయాలు చెప్పి మరల తన పనిలో మునిగిపోయాడు డాక్టరు.
- డా.. కందేపి రాణీప్రసాద్