Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. కందేపి రాణీప్రసాద్
98661 60378
ఎండాకాలం అంటే సెలవులు. సెలవుల్లో పిల్లలకు ఉండవు పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరే అల్లరి వాళ్ళని పట్టుకోవడం అంటే తల్లిదండ్రులకు పెద్ద పని. వాళ్ళని బయట ఎండల్లో ఆటలు అడనివ్వకుండా చూడటం చాల కష్టమైన విషయం. మధ్యాహ్నం పూట ఇంట్లో అందరూ నిద్రపోయే టైములో పిల్లలు బయటకు వెళ్లిపోతుంటారు. ఆకాష్, అవని కూడా అమ్మ ఎప్పుడు నిద్రపోతుందా అని చూస్తుంటారు. అమ్మ, నానమ్మ నిద్రపోగానే ఇద్దరూ బయటపడ్డారు.
వీళ్ళిద్దరికీ తోడుగా ఆ వీధిలో పిల్లలందరి ముఠా ఒకటి తోడుగా ఉన్నది. అందరూ బ్యాట్లు పట్టుకొచ్చారు. రోడ్డు మీద ఆ సమయంలో ఎవరూ తిరగరు కాబట్టి చక్కగా క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. క్రికెట్ అనగానే పిల్లలకు ఎక్కడలేని ఉత్సాహం వరదలా తన్ను కొచ్చేస్తుంది. రెండు గ్రూపులుగా మారి క్రికెట్ అడుతున్నారు. మండిపోయే ఎండా ఉన్నా ఎవరికీ నీరసం రావట్లేదు. బాల్ వేస్తూ బ్యాటింగ్ చేస్తూ వచ్చే పాయింట్ల లెక్కపెట్టుకుంటూ ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద వాళ్ళెవరూ నిద్రలేవక పోవడంతో వాళ్ళ అట బ్రేకుల్లేకుండా సాగుతోంది. ఉన్నట్టుండి ఆకాష్ గభాల్న కింద పడిపోయాడు. పిల్లలందరూ గుమికూడారు. వాళ్ళకు ఒక్కసారిగా భయం వేసింది వెంటనే ఆకాష్ వాళ్ళ అమ్మకు చెప్పారు. ఆకాష్ అమ్మ రజిత గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆకాష్ ను ఎత్తుకొని లోపలకు తీసుకొచ్చింది. పిల్లడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు.
వెంటనే దగ్గర్లో ఉన్నా సృజన్ హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. డాక్టరుకు చూడగానే అర్థమయింది. పిల్లవాడు మన స్పృహలో లేడు. వెంటనే ఐస్ నీళ్ళు తెమ్మని కంపౌండర్ కు చెప్పాడు. ఐస్ నీళ్ళు తెచ్చాక ఆ నీళ్ళతో వళ్ళంతా తుడవమని చెప్పారు. పిల్లవాడి వళ్ళు కాలిపోతూ ఉన్నది. రాజిత ఒళ్ళు తుడుస్తూ డాక్టర్ తో అన్నది. 'వీడికి ఫివరేమి లేదు సార్. ఏంటి ఇంత వళ్ళు కాలిపోతున్నది' అని అడిగింది. 'అది కూడా వడదెబ్బలో ఒక భాగమమ్మా' చెప్పాడు డాక్టరు. పిల్లవాడికి స్టేత్ పెట్టి పరీక్షించారు. కావాల్సిన మందులు తెచ్చుకోమని రాసిచ్చారు. పిల్లవాడికి సెలైన్ పెట్టమని కాంపౌండర్ కు చెప్పాడు.
ఇవన్ని అయ్యే సరికి ఆకాష్ వాళ్ళ నాన్న కంగారుగా పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చాడు. 'ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు'. రెండు మూడు రోజులుంటే తగ్గిపోతుంది. హాస్పిటల్ లో అడ్మిట్ అవండి. మేం మందులు వాడతాముు అని చెప్పాడు డాక్టర్. హడావిడి అంత తగ్గాక డాక్టరు ఆకాష్ వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడాడు. 'ఎండాకాలాలు పిల్లల్ని చాల జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండల్లో ఆటలు అడనివ్వకూడదు. చూడటానికి వడదెబ్బ అనేది చిన్నదిగా అనిపిస్తుంది గానీ ప్రాణాలు పోయేంత ప్రమాదకరం. ఎండాకాలం సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల్ని పట్టుకోవడం కష్టమే. అయినప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా ఇంట్లో ఉండి ఆడుకునే ఆటల్ని ప్రోత్సహించాలి. ఉదయం, సాయంకాలాలు ఆరుబయట ఆడుకున్నా పరవాలేదు. ముఖ్యంగా మే నెల ఎండలు చాలా ప్రమాదకరం. ఆ సమయంలో నీడ పట్టున ఆడుకునేలా వాళ్ళకు అవగాహన కలిగించాలి. ఎండాకాలంలో ఎక్కువగా మంచి నీళ్ళు తాగేలా చూడాలి. కొబ్బరి బొండాలు తెచ్చి తాగిస్తే ఇంకా మంచిది. ఎండకు శరీరం లోని నీటి శాతం తగ్గిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ కాలంలో ఇంట్లో ఓఆర్ఎస్ పాకెట్లు ఉంచుకోవటం అవసరం. అవి లేకపోతే కొద్ది నీళ్ళ లో ఉప్పు, పంచదార కలిపి ఓఆర్ఎస్ ద్రావణు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా ఎండాకాలం జాగ్రత్తలు తీసుకోవాలి' అంటూ పలు జాగ్రత్తలు చెప్పారు డాక్టర్.