Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.కందేపి రాణీప్రసాద్
98661 60378
ఆటో ఆగి ఆగగానే రజని ప్రకాష్ గబుక్కున దూకినట్లే దిగారు. చేతిలో ఏడాదిన్నర పాప ఉంది లోపలకు వస్తూనే “పాపకు సీరియస్ త్వరగా డాక్టర్ను కలవాలి” అడిగారు రిషేప్షనిస్ట్ ను. ‘ ఏమైందమ్మా ‘ అని అడిగాడు కంపౌండర్. అప్పటికే వాళ్ళు డాక్టరు రూములోనికి పరుగులు తీశారు.
“ డాక్టర్ ! డాక్టర్ ! మా పాపను చూడండి ముక్కులో పూసను పెట్టుకుంది. ఇరుక్కుపోయింది బయటకు రావట్లేదు. మేం చాల ప్రయత్నించి చూశాము. కానీ అది లోపలి వెళ్ళింది.” గబగబా పాఠం అప్పజెప్పినట్లుగా చెప్పారు భార్యభర్త లిద్దరూ. డాక్టరు పరీక్ష చేశాడు. ఆ పూస చాలా లోపలికీ పోయింది. ఫోర్ సేప్స్ తో ప్రయత్నించి చూశాడు కనిఅది ముక్కు రంధ్రానికి గట్టిగా అడ్డంగా ఆగిపోయింది. చిన్న పిల్ల కాబట్టి సహకరించదు. ఇలా ఆలోచిస్తూ డాక్టరు పిల్ల వైపు నుంచి తల్లితండ్రుల వైపు చూస్తూ “ ఎప్పుడు పెట్టుకున్నది ఎలా పెట్టుకున్నది. పూసలు ఎందుకిచ్చారు అడుకుంటున్నదా “ వివరాలు అడిగాడు.
సార్ పాప నా భుజం మీదకు పడుకుని ఆడుకుంటున్నది నేను కూరలు కోస్తున్నాను. నా జడకున్న రబ్బరు బాండ్ లాగేసింది. నేను గమనించలేదు దానికున్న పూసలు పీకేసి ముక్కులో పెట్టుకున్నది. కాసేపు తర్వాత నేను వెనక్కి తిరిగి చూసినపుడు కొన్ని పూసలు కింద పది ఉన్నాయి. రబ్బరు బాండ్ పాప నోట్లో ఉన్నది. వెంటనే నోట్లోవి తిసేశాను కానీ ముక్కును చూడలేదు సాయంత్రానికి పాప గాలి పీల్చుకోవడం కష్టమయ్యేసరికి ముక్కును చూశాను. లోపల పూస కన్పించింది తీద్దామని చూశాము కాని రాలేదు “ రజని చక్కగా వివరించి చెప్పింది.
డాక్టరు ఇ ఎన్ టి డాక్టరు కు ఫోన్ చేసి రమ్మని చెప్పి రజనితో ఇలా అన్నాడు. పాప శ్వాసలో తేడా ఉందని గమనించగానే ముక్కులో ఏమైనా పెట్టుకుందేమో అని అనుమానించి చూడడం తెలివైన పని చాల మందికి అలా తెలియదు అలాగే ఊరుకుంటారు ముక్కులో అది అలాగే ఉంది చీము కారుతూ ఉంటుంది. అప్పుడు వస్తారు డాక్టరు దగ్గరకు. అప్పటికి ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ప్రమాద స్థాయికి చేరుతుంది. పూర్వం రోజుల్లో పిల్లలు ఎక్కువగా బలపాలు ముక్కులో పెట్టుకుని ఇరుక్కు పోయిన కేసులు వచ్చేవి. ఇప్పుడు బలపాలే లేవు కాబట్టి పూసలు, విత్తులు లాంటివి కనిపిస్తున్నాయి. కాలం ఏదైనా పిల్లల ఆటలు ఒకటే పిల్లలు ప్రమాదాలు తెచ్చుకోవటం ఒకటే” చెప్తూ ఉండగా తలుపు తీసుకొని ఇ ఎన్ టి డాక్టరు వచ్చాడు.
డాక్టర్లిద్దరు పాపను తీసుకొని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్ళారు. పాపకు మత్తిచ్చి చిన్న ఆపరేషన్ తో లోపల ఇరుక్కు పోయిన పూసను తీశారు. ముక్కు లోపల అంత వాపు ఉంది. పాపకు కావాల్సిన మందులు ప్రిస్క్రిప్షన్ రాశారు. పాపను జాగ్రత్తగా చూడమని హెడ్ నర్సుకు చెప్పి డాక్టర్లిద్దరూ బయటకు వచ్చారు. అమ్మా పాపకు మత్తిచ్చాం కాబట్టి కాసేపాగి చూడండి. లోపల ఇరుక్కున్న పూసను తీసేశాం. ఇక మీకేం భయం లేదు. పిల్లలు చిన్న చిన్న వస్తువులు నోట్లోనో, ముక్కులోనో పెట్టుకుంటారు. అందుకని పిల్లల్ని వెయ్యి కళ్ళతో కాపాడాలి. అయిన మీరు అనుమానించి ముక్కును పరీక్షించి చూసి ఆసుపత్రికి రావటం మంచిదైంది పసిపిల్లలకు తెలీదు కదా అనేక రకాల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ పాప తల్లిదండ్రులకు చెప్పాడు. అలాగే డాక్టర్ అంటూ రజని ప్రకాష్ లిద్దరూ తల ఊపారు.