Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకు బాటలో బాట చూపడం లేకపోతే ఆ దారంతా ఉభూలే కదా
శిథిలమై పోయిన నేటి హృదయాలు
మమతానురాగాల మాట ఎక్కడ
ఆత్మీయ బంధాల ఊసేక్కడ
ఆగాధంలో తొక్కేసిన కలికాలం
మర్చిపోలేని గతం మార్చలేని వాస్తవం
ఆకలి వేటలో పోరాట దాడులే పలకరించాయి అవ్వని
బతుకు ఆటుపోట్లతో కాలం చేసిన గాయం కన్నీటి మడుగులో
గుండెలనిండా బాధల జలం నింపుకుంది
అవమాన భారాన్ని మోస్తూ ఎదలోపల మనోవేదనను సవరిస్తూ
స్వార్ధపూరిత సమాజంలో అనురాగాలను అమ్మకానికి పెట్టి
నాగరికత పోకడలనీ కొత్త పేరు తగిలించుకొని తిరుగుతున్న మనుషులు
నవ మాసపు శ్రమల బాధల్ని తాను మోసి మెతుకు మెతుకును పాలచుక్క గా మార్చన అమ్మతనం
నడివీధిలో యాచిస్తూ చేరదీసే వారు లేక చేతికర్రే సాయం అయింది
కంటి వెలుగులే అనుకున్న కన్న పిల్లలే బాధ్యతల బరువును వదిలేసి అలుసుగా చూసినా
బతుకు దారి వెలుగు చూపుతూ కళ్ళజోడే తోడు నిలిచి కాలే కడుపుకు బుక్కెడు బువ్వ అందించింది
బరువైన బాధలన్నీ గుండె సంచిలో దాస్తూ
చిక్కిశల్యమయిన ఎముకల గూడును ఈడుస్తూ
విధాత రాసిన రాతలను చెరపలేని నిస్సహాయత వృద్ధాప్య శాపమా
తీయని పలకరింపులే కరువైన దైన్యం
నిలువ నీడ లేక నిరాశ్రయమైన ప్రాణం
మండుటెండలో కాలిన పాదాల బోబ్చలకు మాన్పే ఔషధమయ్యే మానవత్వం ఉందా
ప్రాణానికి విలువ ఇవ్వని మనసులేని ఇనుప గుండెల మనుషులు
అమ్మతనానికి రేటు కట్టి చేయి దులుపుకొనే తనయులు
అనగారిన అవశేశపు వస్త్రంలో ఎండుటాకుల వాక్యాలను కాల్చే మృత్యు గీతల సమరాలే కదా
ప్రపంచ ద్వారాలు మూసుకున్న మానవత్వపూ గుండె తలుపు తెరిచి ఎదలో దాచుకుందాం
అనురాగాలు నింపుకున్న అమృతభాండాన్ని అవ్వకు పంచి
అమ్మే దైవం అన్న వాక్యాన్నికైనా నిదర్శనంగా నిలుద్దాం.
- నెల్లుట్ల సునీత
-7989460657