Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరంగం ఇంటి పేరు
సినీరంగం గేయకవి
శ్రామిక రంగం తన ఆవేశం
అంతరంగమే మరో ప్రస్థానం
కన్నె పిల్ల కళ్ళలో పెళ్ళి పందిరి కనపడినా
జోరుగా హుషారుగా షికారుకెళ్ళినా...
కూడులేని గూడులేని దీనుల జీవితాలు
మారుటెన్నడో అని ప్రశ్నించినా..
కదిలి రండి మనుషులైతే
అంటూ విప్లవ శంఖం పూరించినా....
భిన్నస్వరాల మానవాళి మదిలో రారాజువి!!
పతితులార భ్రష్టులార దగాపడిన తమ్ములార
ఏడవకేడవకండి ఏడవకండి..... అంటూ ఓదార్చినా ....
మొయిల్టారిన బయల్దేరిన
రధచక్రాలొస్తున్నాయి వొస్తున్నాయని
బాధాతప్త హృదయాలలో....
ఆశా స్ఫూర్తిని అందించిన వ్యక్తివి నీవు!
కలవారలు లేని వారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే అంటూ
దారి చూపిన నీ మేధోశక్తికి మా జోహార్లు!
బడుగు జీవుల ఆశాకిరణమా!
నీ మాటల శక్తి అనంతం!!!
శ్రమైక శక్తిని మేల్కొలిపే కవిరాజమా
నీ కవిత్వమెందరికో స్పూర్తి!!
నీపేరు విన్న ఉప్పొంగు కవితావేశం
మరోప్రపంచానికి దారి చూపే దిక్సూచి
నీఅడుగుజాదలో మరెందరో కవులు
కాని ప్రతి కవి కాలేడు మరో శ్రీశ్రీ
యుగాంతం వరకూ నీవు చిరంజీవివే!!
-మణినాథ్ కోపల్లె
9703044110