Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయవంచక నిజాం పాలకుల
దాస్య శృంఖలాలను తెగ నరికి
తెలంగాణను సాధించుకున్న రోజు..
పోరాటమే ఊపిరిగా..ఎందరో వీరులు సర్వస్వాన్ని..
ధార పోసిన అమరుల ప్రాణ త్యాగ ఫలం..
తెలం'గానం' యాదికొచ్చే సుదినం..
నిత్యావమానాలు, అన్నార్థుల రోదనలు
ఆకలి చావులు, మాన ప్రాణ హింసలు
కష్టాల కడగండ్లు..
"నీ కాళ్లు మొక్కుతా బాంఛన్ దొర!"
హేళనా హేయ బానిసత్వం
నిర్ధయ చర్యల నుండి విముక్తి చెందిన రోజు..
భూమి కోసం..భుక్తి కోసం..ఉనికి కోసం..
మా గడ్డ మాకేనని ఉద్యమ పోరుతో..
నైజాం మూల స్తంభాన్ని
కూకటి వేళ్లతో పెకలించి
గెలిచి నిలిచిన మన తెలంగాణ విమోచన ఉద్యమం..
భారత స్వతంత్ర సంగ్రామంలో జ్వలించిన అగ్ని కిరణం..!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.